ఆకాశ మహా-కాశంబులు
Written by: Songs of Zion
ఆకాశ మహా-కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా (2) కృప జూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి (2) కాపాడితివి నడిపితివి (2) నీ యింటికి మమ్ములను (2) ||ఆకాశ|| నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు (2) నీదు కల్వరి రక్తమున (2) నీవే కడుగు కరుణామయా (2) ||ఆకాశ|| నీతి న్యాయముల కర్త ప్రీతి తోడ నీ ప్రజలకు (2) నీతి న్యాయముల నిమ్ము (2) స్తుతియింప నిరతంబు (2) ||ఆకాశ|| రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజ (2) విజయమిమ్ము మా విజయుండా (2) నిజమైన నీ ప్రజలకు (2) ||ఆకాశ|| బలపరచు నీ భక్తులను బలము తోడ ప్రవేశించి (2) విలువైన నీ రక్షణను (2) ధరింప చేయుము హల్లెలూయా (2) ||ఆకాశ||