అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
Written by: Songs of Zion
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2) చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య|| చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2) నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య|| నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2) స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య|| కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2) ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య|| తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2) మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య|| పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2) కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య|| మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2) మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||