ఆకాశమందు నీవుండగా
Written by: Songs of Zion
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను (2) శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా (2) నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు|| వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు (2) మరణము మ్రింగగ కాంక్షించినా నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు|| పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు (2) నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||