ఇది కోతకు సమయం Idi Kothaku Samayam

Written by: Andhra Kraisthava Keerthanalu

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)         ||ఇది కోతకు||

కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2)         ||ఇది కోతకు||

సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2)         ||ఇది కోతకు||

శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపవా (2)         ||ఇది కోతకు||