ఆకాశ వాసులారా
Written by: Andhra Kraisthava Keerthanalu
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి (2) ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా (2) సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా (2) వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా (2) యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||