అంజలి ఘటియింతు దేవా
Written by: Bro. Diyya Prasada Rao
అంజలి ఘటియింతు దేవా (2) నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ (2) సిలువ మహా యజ్ఞ సింధూర రక్తా రుణమేయ సంభావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ (2) పరలోక సింహాసనాసీన తేజో విరాజమాన జగదావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి||