అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
Written by: Diyya Prasada Rao
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) యేసు రక్తమే జయము క్రీస్తు రక్తమే విజయము (2) పాప క్షమాపణ యేసు రక్తములోనే శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| తండ్రి చిత్తము నెరవేర్చ గెత్సేమనేలో ప్రార్ధింప (2) చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| శాపానికి ప్రతిఫలము ముళ్ళు ముండ్ల కిరీటముతో చెల్లు (2) ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| నీ చేతుల పనిని ఆశీర్వదింప ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||