అందాల బాలుడు ఉదయించినాడు
Written by: Bro. Sayaram Gattu
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) దారి చూపే తార రారాజునే జేర (2) మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||