అంబరాన్ని దాటే సంబరాలు నేడు
Written by: Bro. Sayaram Gattu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||