Yudhamu Yehovaade యుద్ధము యెహోవాదే

 యుద్ధము యెహోవాదే (4) 
 రాజులు మనకెవ్వరు లేరు 
 శూరులు మనకెవ్వరు లేరు (2) 
 సైన్యములకు అధిపతి అయినా 
 యెహోవా మన అండ           ||యుద్ధము|| 
  
 వ్యాధులు మనలను పడద్రోసినా 
 బాధలు మనలను కృంగదీసినా (2) 
 విశ్వాసమునకు కర్త అయినా 
 యేసయ్యే మన అండ           ||యుద్ధము|| 
  
 ఎరికో గోడలు ముందున్నా 
 ఎర్ర సముద్రము ఎదురైనా (2) 
 అద్బుత దేవుడు మనకుండా 
 భయమేల మనకింకా           ||యుద్ధము|| 
  
 అపవాది అయిన సాతాను 
 గర్జించు సింహంవలె వచ్చినా (2) 
 యూదా గోత్రపు సింహమైనా 
 యేసయ్య మన అండ           ||యుద్ధము||