ఉదయించినాడు నా జీవితాన Udayinchinaadu Naa Jeevithaana
Written by: Bro. V Joshua
ఉదయించినాడు నా జీవితాన నా నీతిసూర్యుడు నా యేసయ్యా నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు|| మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2) మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు|| గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2) గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటినే (2) గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు|| కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏతెంచెను (2) ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||