ఉదయమాయె హృదయమా Udayamaaye Hrudayamaa
Written by: Bro. N Sanjay
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే (2) పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే (2) రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే (2) తండ్రి నీవే దిక్కు మాకని ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| పరిశుద్ధుడా పావనుండా పరంధాముడా చిరంజీవుడా (2) పగటియంతయు కాచి మము పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| తండ్రి దాతవు నీవని ధరయందు దిక్కు ఎవరని (2) రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||