Sumadhura Swaramula Gaanaalatho సుమధుర స్వరముల గానాలతో

Written by: హోసన్నా మినిస్ట్రీస్

Ministry: హోసన్నా మినిస్ట్రీస్

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)        ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2)        ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2)        ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2)        ||సుమధుర||