నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
Written by: Songs of Zion
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా – ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము – నేను పొందాలని (2) అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను – తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||