Neevunte Naaku Chaalu Yesayyaa నీవుంటే నాకు చాలు యేసయ్యా
Written by: Rev. Sam J. Vedala
నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||