మధురమైనది నా యేసు ప్రేమ
Written by: PS.G. Devadas
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసుని ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2) నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2) మరణపు ఛాయలే దరి చేరనీయక (2) కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి (2) మరణపు ముల్లును విరచిన దేవా (2) జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||