ఇశ్రాయేలు దేవా Ishraayelu Devaa
Written by: Bro. Jayaraj
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) ఏమని నిన్ను నేను కీర్తింతును ఏమని నిన్ను నేను పూజింతును (2) ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు|| నా పితరులెందరో నిన్ను ఘనపరచి దహనబలులు నీకు అర్పించగా (2) ఇంపైన సువాసనగా అంగీకరించి దీవెన వర్షము కురిపించితివే (2) ||ఆరాధనా|| నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి స్తుతుల సింహాసనము నీకు వేయగా (2) ఆనంద తైలముతో నన్నభిషేకించి స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) ||ఆరాధనా|| నా కొరకు సీయోనును సిద్ధపరచి మహిమతో తిరిగి రానైయుంటివే (2) ఆనంద ధ్వనులతో నన్నూరేగించి శాశ్వత జీవము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||