ఇదే నా కోరిక Ide Naa Korika

Written by: Bro. R R K Murthy

ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక (2)          ||ఇదే నా కోరిక||

యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని (2)
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని (2)   ||ఇదే నా కోరిక||

ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని (2)
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని (2)     ||ఇదే నా కోరిక||

యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని (2)
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని (2)             ||ఇదే నా కోరి