స్థిరపరచువాడవు Sthiraparachuvaadavu

Written by: Daniel Praneeth

Ministry: King of Kings Ministries

 స్థిరపరచువాడవు బలపరచువాడవు
 పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
 ఘనపరచువాడవు హెచ్చించువాడవు
 మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)
 
 ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
 నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2)
 యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2)
 
 సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
 నీ చేతిలోనే మా జీవమున్నది (2)
 మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి
 మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2)            ||ఏమైనా||
 
 నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
 నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2)
 మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
 అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2)            ||ఏమైనా||