ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు Ee Udayamuna Neevu Lechi Emi Thalachuchunnaavu
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం (2) బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా (2) అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)