ఈ జీవితం విలువైనది Ee Jeevitham Viluvainadi
Written by: Bro. Satyaveda Sagar
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||