ఈ దినమెంతో శుభ దినము Ee Dinamentho Shubha Dinamu
ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||