ఈ దినం క్రీస్తు జన్మ దినం Ee Dinam Kreesthu Janma Dinam
Written by: Bro. Krupadas Kollati
ఈ దినం క్రీస్తు జన్మ దినం శుభకరం లోక కళ్యాణం పరమును విడచి ఇలకు చేరిన మహిమ అవతారం (2) ఆడుము పాడుము ప్రభుని నామము నూతన గీతముతో రక్షణ పొందుము ఈ సమయము నూతన హృదయముతో (2) ||ఈ దినం|| దేవ దూతలు పలికిన ప్రవచనం జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2) ధన్యత కలిగిన దావీదు పురము కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| పాప దుఃఖములన్నియు పారద్రోలును కృపయు క్షేమము కలుగజేయును (2) రక్షణ నొసగెడి పరమ సుతునికి ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||