అప్పగింపబడిన రాత్రి
Written by: Bro. Padidem Anantha Rao
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2) చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప|| రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2) పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప|| ద్రాక్షా రస గిన్నెను చాపి వీక్షించుడిదియే నా రక్తం (2) రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప|| రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి (2) నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప|| ఇదిగో వచ్చె తుది ఘడియ హృదయ బాధ హెచ్చెను (2) పదిలపరచు-నట్లు తండ్రిన్ మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||