అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే
Written by: J C Kuchipudi
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| బండనే చీల్చగా – జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2) యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| కష్టాల కడలిలో – కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2) కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||