అన్ని నామముల కన్న పై నామము
Written by: PS. M Jyothi Raju
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) పాపముల నుండి విడిపించును యేసుని నామము (2) నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము (2) ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము || స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము (2) జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||