అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
Written by: Sis.B Esther Rani
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల|| దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు (2) ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు (2) జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||