అందరు మెచ్చిన అందాల తార
Written by: Bro. Gudeti Purushotham Babu
అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు (2) నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు (2) నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు (2) తప్పును తెలిసి తిరిగి రాగా క్షమియించి కృప చూపినాడు (2) ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు (2) కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే (2) హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||