అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ
Written by: Bro. Ramesh
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా (2) ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు|| సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం (2) సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు|| యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత (2) క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు||