Aashraya Durgamaa – Naa Yesayyaa ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
Written by: Hosanna Ministries
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2) స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||