Aalakinchumo Devaa Maa Aakrandananu ఆలకించుమో దేవా మా ఆక్రందనను

Written by: Bro. Srinivas Bandaru

ఆలకించుమో దేవా మా ఆక్రందనను
కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2)
మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి
బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా…

భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము
మా ప్రార్థన ఆలకించుమో దేవా (2)
మా కనులెత్తుచున్నాము కనికరించుము
నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము
అంధకారము అలముకొన్న – ఈ లోకములో
గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము     ||ఆలకించుమో||