ఆకర్షించే ప్రియుడా
Written by: Dr. Thomas
ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2) నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2) నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2) నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2) అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే|| నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను (2) దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2) అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||