ఆకాశం నీ సింహాసనం
Written by: Bro. Joel Jaswanth Gummadi
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం (2) సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇల నా హృదయ వందనం అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2) మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం|| పరలోక తెరపైట తొలగించగా స్తుతి గీత పాటలు వినిపించగా (2) పరిశుద్ద ఆత్ముడు నను తాకగా రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం|| నీ స్వరము ఉరుమై వినిపించగా అదిరింది నా గుండె ఒకసారిగా (2) నీ కిరణాలు మెరుపై నను తాకగా వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం|| భువిలోని సృష్ఠంత నీ మాటగా దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2) పరలోక రాజ్యానికి నువ్వు దారిగా వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||