ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా Aahaa Mahaathma Haa Sharanya
Written by: Bro. Panthagaani Paradeshi
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా|| దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా|| శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా|| అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||