ఆగని పరుగులో ఎండిన ఎడారులు
Written by: Bro. Joshua Shaik
ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2) కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపున కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని|| లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ||ఆగని|| ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2) నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము ||ఆగని||