ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju
Written by: Bro. Bunny Sudarshan
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు నా రాజు రాజులకు రాజు (2) యేసు పుట్టెను ఈ లోకంలో ఆనందమే గొప్ప ఆనందమే (2) ఆనందమే గొప్ప ఆనందమే సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే|| యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా లోక రక్షకుడు జన్మించెను లోక పాపాలను కడిగి వేయగా భువిలో బాలుడిగా అరుదించెను (2) పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే|| వీనుల విందుగా – దీనుల అండగా కరుణా కారకుడు కడలివచ్చెను పాపుల శాపాలను తానే మోయగా పరమ పాలకుడు పుడమి చేరెను (2) కుల మత బేధాలను హరియించ వచ్చెను పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే||